గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 45 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించింది. హైదరాబాద్ పరిధిలో 22, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 5, సంగారెడ్డి జిల్లాలో 3 బస్తీ దవాఖానాలను ఆయా పరిధి ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు ప్రారంభించారు.
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 123 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ప్రతిరోజు 10వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. కొత్తగా ప్రారంభమైన 45 దవాఖానాలతో అదనంగా 4వేల మందికి వైద్య సేవలు అందనున్నాయి. ఒక్కో బస్తీ దవాఖానాలో.. ఒక వైద్యుడు ఒక నర్స్, ఒక సహాయకుడు ఉండనున్నారు.
సికింద్రాబాద్లోని చేపలబావి, నాలా బజార్ ప్రాంతాల్లోని బస్తీ దవాఖానాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఈ ఆసుపత్రులు ఎంతగానో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు.