రాష్ట్రంలో మరో 4,298 కరోనా కేసులు, 32 మరణాలు నమోదు
19:19 May 15
రాష్ట్రంలో మరో 4,298 కరోనా కేసులు, 32 మరణాలు నమోదు
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 4,298 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్ బారినపడి మరో 32 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2,928కు చేరింది. మరో 6,026 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 53,072 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 601, మేడ్చల్ జిల్లాలో 328, రంగారెడ్డి జిల్లాలో 267 కేసులు వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: కొవిడ్ చికిత్స: నగదు రూపంలో ఎంత చెల్లించవచ్చు?