తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు గ్రేటర్ లో మరో 24 బస్తీ దవాఖానాలు ప్రారంభం - హైదరాబాద్ లో బస్తీ దవాఖాల వార్తలు

రేపు హైదరాబాద్ లో మరో 24 బస్తీ దవాఖానాలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా 199 బస్తీ దవాఖానాలు ఉండగా... కొత్త వాటితో సంఖ్య 223కు చేరనుంది.

రేపు గ్రేటర్ లో మరో 24 బస్తీ దవాఖానాలు ప్రారంభం
రేపు గ్రేటర్ లో మరో 24 బస్తీ దవాఖానాలు ప్రారంభం

By

Published : Nov 11, 2020, 8:12 PM IST

గ్రేటర్ హైదరాబాద్ లో రేపు మరో 24 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. నగరంలోని పేద ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం కోసం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా 199 బస్తీ దవాఖానాలు ఉన్నాయని... కొత్త వాటితో 223కు చేరనుంది.

గురువారం ఉదయం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, కాచిగూడలో మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. మిగతా వాటిని మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రారంభించనున్నారు. గ్రేటర్ లో వార్డుకు ఒకటి మొత్తం 300 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడమే లక్ష్యమని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:దుబ్బాక ఓటమితో తెరాసలో అంతర్మథనం

ABOUT THE AUTHOR

...view details