రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 2,384 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,04,249కి చేరింది. వైరస్ బారిన పడి మరో 11 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 755కి చేరింది. గడిచిన 24 గంటల్లో 40,666 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,384 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మరో 1,347 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉన్నట్లు స్పష్టం చేసింది.
తెలంగాణలో మరో 2,384 కరోనా కేసులు, 11 మరణాలు - కరోనా కేసుల తాజా వివరాలు
08:24 August 23
రాష్ట్రంలో మరో 2,384 కరోనా కేసులు, 11 మరణాలు
కరోనా నుంచి కోలుకుని మరో 1,851 మంది బాధితులు డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటి వరకు 80,586 మంది కోలుకుని ఇళ్లకెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,908 యాక్టివ్ కేసులుండగా.. 16,379 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు.
తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 472, రంగారెడ్డి 131, జగిత్యాల 105, ఆదిలాబాద్ 25, కొత్తగూడెం 52, జనగామ 30, జయశంకర్ భూపాలపల్లి 7, జోగులాంబ గద్వాల 68, కామారెడ్డి 69, కరీంనగర్ 120, ఖమ్మం 105, అసిఫాబాద్ 12, మహబూబ్‌నగర్ 61, మహబూబాబాద్ 52, మంచిర్యాల 90, మెదక్ 23, మల్కాజిగిరి 52, ములుగు 19, నాగర్‌కర్నూల్ 29, నల్గొండ 137, నారాయణపేట 13, నిర్మల్ 19, నిజామాబాద్ 148, పెద్దపల్లి 65, సిరిసిల్ల 42, సంగారెడ్డి 61, సిద్దిపేట 67, సూర్యాపేట 110, వికారాబాద్ 19, వనపర్తి 47, వరంగల్ అర్బన్ 85, వరంగల్ రూరల్ 21, భువనగిరి 28 కేసులు నమోదయ్యాయి.
ఇవీ చూడండి: నిండుకుండలా ఎల్లంపల్లి ప్రాజెక్టు.. 8 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల