సీఎం, మంత్రులు, అధికారుల పేర్లతో 50 బాటిళ్ల పార్శిళ్లు వచ్చిన ఘటన సికింద్రాబాద్ పోస్టాఫీస్‌లో చోటుచేసుకుంది. బాటిళ్లను గుర్తించిన పోస్టల్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. బాటిళ్లలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని అనుమానించిన పోలీసులు... శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు పార్శిళ్లలో కొన్ని తాగునీటి బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రజలు బయట కలుషిత నీళ్లు తాగితే ప్రజాప్రతినిధులు ఏసీ రూముల్లో కూర్చుని మినరల్ వాటర్ తాగుతున్నారు. ఈ విషయంపై సందేశాన్ని ఇచ్చేందుకే ఓయూ విద్యార్థులే బాటిళ్లను పంపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రముఖుల పేర్లతో 50 బాటిళ్ల పార్శిల్స్ పంపిన అజ్ఞాతవ్యక్తులు - పోస్టల్ అధికారులు
సికింద్రాబాద్ పోస్టాఫీస్ పార్శిల్స్ విభాగంలో ఒక్క సారిగా అలజడి రేగింది. ఎవరు పంపారో తెలిదూ కానీ సీఎం, మంత్రులు, అధికారుల పేర్లతో 50 బాటిళ్ల పార్శిల్స్ పోస్టాఫీస్‌కి వచ్చాయి.
ప్రముఖుల పేర్లతో 50 బాటిళ్ల పార్శిల్స్ పంపిన అజ్ఞాతవ్యక్తులు
Last Updated : Aug 21, 2019, 5:53 PM IST