తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నవరం సత్యనారాయణస్వామి దర్శన సమయం పొడిగింపు - అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శన సమయం పొడిగింపు

ఏపీలోని అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శన సమయాన్ని పొడిగించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వామి వారిని సేవించుకోవచ్చని ఆలయ ఈవో తెలిపారు.

annavaram-temple-timing-in-eastgodavari
అన్నవరం సత్యనారాయణస్వామి దర్శన సమయం పొడిగింపు

By

Published : Jul 4, 2020, 7:21 AM IST

కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లాలోని బఫర్ జోన్లలో అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాలన్ని ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఇప్పటి వరకు అనుమతించారు. స్వామి దర్శనానికి దూరప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి దర్శనానికి అవకాశం లేక వెనుదిరుగుతున్నారు. దర్శన సమయాలు పెంచాలని భక్తుల నుంచి డిమాండ్ రావడంతో.. అనుమతి కోసం దేవస్థానం అధికారులు జిల్లా కలెక్టర్​కు లేఖ రాశారు.

బఫర్ జోన్​కి కొండ దిగువ నుంచి కొండ పైకి సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉండటంతో కలెక్టర్ అనుమతి ఇచ్చారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కలెక్టర్ అనుమతితో నేటి నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి సాయంత్రం వరకు అనుమతిస్తామని ఈవో తెలిపారు. చండీ హోమం, అయుష్య హోమం, నిత్య కల్యాణం లాంటి ఆర్జిత సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం ఉంది. కేశ ఖండన సాయంత్రం వరకు కొనసాగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యాన్నదానం, కొండపై భక్తులకు వసతి కేటాయింపు తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కొండపై వివాహాలు, ఉపనయనాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసాన్ని తాత్కాలికంగా నిలిపేశారు.

ఇదీ చదవండి:రైల్వే బోర్డు కీలక నిర్ణయం.. కొలువులకు ఎర్రజెండా

ABOUT THE AUTHOR

...view details