Annavaram giri pradikshana: కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. గ్రామంలోని తొలి పావంచాల వద్ద నుంచి ప్రదక్షిణ ప్రారంభమైంది. సుమారు 11.5 కిలోమీటర్లు మేర ప్రదక్షిణ సాగింది. చంద్ర గ్రహణం సందర్భంగా ఉదయం 6 గంటలకే ప్రదక్షిణ ప్రారంభించారు.
అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షణ.. కనులకు పండుగ.. - కాకినాడ జిల్లా తాజా వార్తలు
Annavaram giri pradikshana: కార్తిక మాసం పురస్కరించుకుని పలు దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీలోని అన్నవరంలో జరిగిన సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులు పల్లకిలో వెళ్తుండగా వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
![అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షణ.. కనులకు పండుగ.. Annavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16866968-506-16866968-1667889101885.jpg)
అన్నవరం సత్యనారాయణ స్వామి
సత్యనారాయణ స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులు పల్లకిలో వెళ్తుండగా వేలాది మంది భక్తులు వెంట నడిచారు. సత్యనారాయణ స్వామి నామస్మరణతో రత్న, సత్య గిరులు మార్మోగాయి. గ్రామంలో ప్రధాన రహదారి, జాతీయ రహదారి, రత్న, సత్య గిరులు చుట్టూ, పంపా సరోవరం మీదుగా ప్రదక్షిణ సాగింది.
అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షణ.. కనులకు పండుగ..
ఇవీ చదవండి: