Anna canteen completed 200 days: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొబైల్ అన్నా క్యాంటీన్ ప్రారంభించి మంగళవారానికి 200 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా పేదలకు రెండు రూపాయలకే మాంసాహార భోజనాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నా క్యాంటీన్లు మూసివేయడంతో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొబైల్ అన్నా క్యాంటీన్ ఏర్పాటుచేసి పేద ప్రజలకు రెండు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
2 రూపాయలకే మాంసాహార భోజనం..మొబైల్ అన్నా క్యాంటీన్లో..! - Non veg meal for 2 rupees
Anna canteen completed 200 days: వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు మూసివేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొబైల్ అన్నా క్యాంటీన్ ఏర్పాటుచేసి పేద ప్రజలకు రెండు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ప్రారంభించి మంగళవారానికి 200 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా రెండు రూపాయలకే మాంసాహార భోజనాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందించారు.
2 రూపాయలకే మాంసాహార భోజనం
ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ఏర్పాటుచేసి 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు రూపాయలకే మాంసాహార భోజనంతో పాటు కోడిగుడ్డు, స్వీటును కూడా అందించారు. హిందూపురంలోని ఈ క్యాంటీన్లో ఏర్పాటు చేసిన రోజు నుంచి వైసీపీ నాయకులు రెండు దఫాలు పంపిణీ చేసే స్థలాన్ని మార్చారని ఇప్పుడు కూడా మరో స్థానానికి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు హెచ్చరించారు.
ఇవీ చదవండి: