తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏఎన్​ఎం కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మారుస్తున్నాం: హరీశ్​రావు

ANMS meet attend minister harishrao: బీజేపీ పాలిత రాష్ట్రాలు వైద్యారోగ్య విభాగంలో వెనుకబడి ఇన్నాయని.. బీజేపీయేతర రాష్ట్రాలే ముందున్నాయని మంత్రి హరీశ్​రావు అన్నారు. హైదరాబాద్​లోని బాగ్‌ లింగంపల్లిలోని కళాభవన్‌లో ఏర్పాటు చేసిన ఏఎన్​ఎంల మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ANMS meet attend minister harishrao
మంత్రి హరీశ్​రావు

By

Published : Nov 20, 2022, 7:34 PM IST

ANMS meet attend minister Harishrao: డబుల్ ఇంజిన్ ఓ పెద్ద ట్రబుల్ ఇంజిన్ అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని కళాభవన్​లో ఏర్పాటు చేసిన ఏఎన్​ఎంల 2వ మహాసభలకు మంత్రి హరీశ్​రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎన్​ఎంల సేవల గురించి మంత్రి మాట్లాడారు. కరోనా సమయంలో ఏఎన్​ఎంలు చేసిన విశేష సేవలకు మంత్రి అభినందించారు. అంతా కలిసి ఆరోగ్య తెలంగాణ నిర్మించాలని.. రెండు మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గర్భిణీల కోసం 58 టిఫా కేంద్రాలు ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఏఎన్​ఎం కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మారుస్తున్నట్టు హరీశ్​రావు వెల్లడించారు. 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం డెలివరీలు అయితే ప్రస్తుతం అవి 67 శాతానికి పెరిగాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు వైద్యారోగ్య విభాగంలో వెనకబడి ఇన్నాయని.. బీజేపీయేతర రాష్ట్రాలే ముందున్నాయన్నారు. ఇందులో ప్రతి ఒక్కరి కష్టం ఉందన్న మంత్రి.. మెరుగైన వైద్యం అందించేందుకు ఏఎన్​ఎంలు కృషి చేస్తున్నారన్నారు. వారి సమస్యల పరిష్కారానికి సైతం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలు వైద్యారోగ్య విభాగంలో వెనకబడి ఉన్నాయి. బీజేపీయేతర రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయి. మెరుగైన వైద్యం అందించేందుకు ఏఎన్​ఎంలు కృషి చేస్తున్నారు. ఏఎన్​ఎం కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మారుస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 67 శాతానికి పెరిగాయి. - హరీశ్​రావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

2వ ఏఎన్​ఎం మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హారీశ్​రావు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details