తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి తాత్కాలిక ఉద్యోగుల యత్నం - anm's arrest at cm camp office updates

తాడేపల్లిలోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు కొవిడ్ తాత్కాలిక ఉద్యోగులు యత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

anms-arrest-at-cm-camp-office-in-tadepalli in andhra pradesh
ఏపీ సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి ఉద్యోగుల యత్నం

By

Published : Mar 1, 2021, 3:11 PM IST

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిలోని ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన కొవిడ్ తాత్కాలిక ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా సమయంలో తాత్కాలికంగా తీసుకున్న నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని పర్మినెంట్ చేయాలంటూ చలో సీఎం క్యాంపు కార్యాలయం పేరుతో ఉద్యోగులు ఆందోళనకు తరలివెళ్లారు.

అప్రమత్తమైన పోలీసులు... క్యాంపు కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి వచ్చిన సుమారు 30 మంది తాత్కాలిక ఉద్యోగులను అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి:మోదీకి కొవాగ్జిన్ టీకాపై భారత్​ బయోటెక్ హర్షం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details