హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని ఆర్.కె. పురం డివిజన్లోని చిత్రాలేవుట్ కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో సంఘం అధ్యక్షుడిగా ముస్కు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అన్నపూర్ణ, కోశాధికారిగా తోట రాంబాబు ఘన విజయం సాధించారు.
చిత్రలేవుట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా అంజిరెడ్డి - GHMC latest news
హైదరాబాద్ చిత్రలేవుట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా అంజిరెడ్డి ఎన్నికయ్యారు. చిత్రలేవుట్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని అంజిరెడ్డి హామీనిచ్చారు.
చిత్రలేవుట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా అంజిరెడ్డి
చిత్రలేవుట్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా అంజిరెడ్డి హామీనిచ్చారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించి సుందరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. కాలనీలో అందరం ఐక్యమత్యంగా ఉందామని పిలుపునిచ్చారు.
- ఇదీ చదవండి:తెలంగాణలో మరో 142 కరోనా కేసులు...