National Herald case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అధికారులు ఒక్కొక్కరిని పశ్నిస్తున్నారు. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేత అంజన్ కుమార్‌ను ఈరోజు ఈడీ అధికారులు విచారించారు. ఉదయం 11 గంటలు నుంచి మధ్యాహ్నం 2 గంటలు వరకు ప్రశ్నించిన ఈడీ.. యంగ్ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు సేకరణ గురించి ఆయన్ను ప్రశ్నించారు.
'రేవంత్ చెబితేనే నేషనల్ హెరాల్డ్‌కు విరాళాలు ఇచ్చాను..' - తెలంగాణ తాజా వార్తలు
National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో అంజన్ కుమార్ విచారణ ముగిసింది. ఉదయం 11గంటలు నుంచి మధ్యాహ్నం 2 గంటలు వరకు ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు గురించి ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించినట్లు తెలిపారు.
ED
దీనిపై మాట్లాడిన అంజన్ కుమార్ రేవంత్ రెడ్డి సూచన మేరకే ఆ సంస్థకు విరాళాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సంస్థ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందనే కారణంగా స్వచ్ఛందంగా విరాళం ఇచ్చినట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమ నేతలను ఈడీ విచారిస్తోందని ఆయన ఆరోపించారు. మళ్లీ విచారణ ఉంటే ఈడీ అధికారులు పిలుస్తామని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి:
Last Updated : Nov 23, 2022, 4:07 PM IST