తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు ఉపయోగపడే ఒప్పందం

తెలంగాణ రాష్ట్ర రైతులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు ఉపయోగపడే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు రాష్ట్ర పశుసంవర్థక విశ్వవిద్యాలయం, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ. ఈ ఒప్పందం రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

రైతులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు ఉపయోగపడే ఒప్పందం

By

Published : Apr 25, 2019, 4:40 AM IST

Updated : Apr 25, 2019, 9:24 AM IST

రాష్ట్ర పశుసంవర్థక విశ్వవిద్యాలయంతో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వ విద్యాలయం ఉపకులపతి సందీప్ కుమార్ సుల్తానియా, జాతీయ సహకారా అభివృద్ధి సంస్థ ఎండీ ఎస్.కె నాయక్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తెలంగాణ ప్రజలకు సహకార, అభివృద్ధి రంగాలలో ఉపయోగపడే విధంగా పరిశోధన, బోధన, శిక్షణ కార్యక్రమాలను ఇరు సంస్థలు కలిపి చేపట్టనున్నాయి. దీని ద్వారా విద్యార్థులకు, రైతులకు, ఉద్యోగులకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తారు. దానికోసం కావాల్సిన ఆర్థిక వనరులను ఎన్సీడీసీ సమకూర్చనుంది. ప్రస్తుతం ఈ ఒప్పందం ఐదేళ్ల వరకు ఉంటుంది. తదుపరి ఇరు సంస్థల అంగీకారంతో మరో ఐదు సంవత్సరాలు పొడిగించుకోవచ్చని పశు వైద్య విశ్వవిద్యాలయం వెల్లడించింది.

Last Updated : Apr 25, 2019, 9:24 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details