హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంగారు చీరను సమర్పించారు. ఈ బంగారు చీరను తెరాస నేత కూనా వెంకటేశ్‌గౌడ్, దాత శివరామ కృష్ణా రెడ్డి చేయించారు. 2.5 కిలోల పుత్తడిని ఉపయోగించి బెంగుళూరులో చీరను అద్భతంగా తయారు చేశారు.
బల్కంపేట ఎల్లమ్మకు 2.5 కేజీల బంగారు చీర - telangana news
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీరను సమర్పించారు. ఈ బంగారు చీరను తెరాస నేత కూనా వెంకటేశ్‌గౌడ్, దాతలు తయారు చేయించారు.
బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర సమర్పించిన తలసాని
తొలుత ఎమ్మెల్సీ కవిత, మంత్రి తలసాని చేతులమీదుగా అమ్మవారికి చీరను సమర్పించాలని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్సీ కవిత ఆలయానికి రాకపోవటంతో మంత్రి తలసాని, కూన వెంకటేష్ గౌడ్ సంయుక్తంగా అమ్మవారికి చీరను సమర్పించారు. అందరూ బాగుండాలని ఎల్లమ్మ తల్లిని కోరుకున్నట్లు తలసాని తెలిపారు. అమ్మవారికి చీర సమర్పించడం ఆనందంగా ఉందన్నారు.
ఇదీ చదవండి:తప్పుల తడకగా అదనపు మార్కులు
Last Updated : Feb 17, 2021, 11:31 AM IST