రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో జంతు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ నాగోల్ ఫత్తుల్‌గూడలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జంతు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, ప్రముఖ సినీ నటి అమల అక్కినేని, పీపుల్స్ ఫర్ యానిమల్స్ సంస్థ అధ్యక్షురాలు వాసంతి వాడి, డాక్టర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో అంబర్‌పేట, కూకట్‌పల్లి, మహాదేవ్‌పూర్ ప్రాంతాల్లో ఐదు యానిమల్ కేర్ సెంటర్ ఉన్నాయని అరవింద్‌కుమార్ తెలిపారు. ఫత్తుల్గూడ కేంద్రం నిర్వహణ బాధ్యతలను పీపుల్స్ ఫర్ యానిమల్స్ సంస్థకు అధికారికంగా అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.