ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్‌కుమార్ భిశ్వభూషణ్చే ప్రమాణం చేయించనున్నారు. విభజన అనంతరం కూడా నరసింహన్ రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌కు తొలి గవర్నర్‌గా బిశ్వ భూషణ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన మంగళవారమే రాష్ట్రానికి చేరుకున్నారు.
ఏపీ గవర్నర్‌గా నేడు బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం - andhrapradesh new governer bishvabhushan harichandan will charg today
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మంత్రులు, ప్రముఖుల మధ్య... ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరుకానున్నారు. రాజ్ భవన్‌ను సర్వాoగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా గవర్నర్ ముఖ్యులతో సమావేశమయ్యే మందిరాన్ని కలంకారి చిత్ర రూపాలతో అందంగా అలంకరించారు. 11.15 గంటలకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాజ్ భవన్‌కు చేరుకుంటారు. 11.20కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకుని.. గవర్నర్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పరిచయం చేస్తారు. 11.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం ఫొటో సెషన్, తేనీటి విందుతో కార్యక్రమం ముగుస్తుంది. గవర్నర్ ప్రమాణ స్వీకారం దృష్ట్యా రాజ్ భవన్ ప్రాంతంలో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండీ : 'కిషన్ రెడ్డిని బెదిరించిన వ్యక్తి అరెస్ట్'