తెలంగాణ

telangana

ETV Bharat / state

వామ్మో సూపర్‌ స్ప్రెడర్స్‌... వారి వల్లే 300 మందికి కరోనా.. - ap corona cases total

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో సుమారు 40 మంది నుంచి కరోనా వ్యాప్తి ఎక్కువగా జరిగినట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. వీరివల్ల 300మందికి పైగా వైరస్ బారిన పడినట్లు తేల్చింది. వీరిని వైద్యారోగ్య శాఖ 'సూపర్ స్పైడర్'​గా పేర్కొంటోంది.

andhrapradesh-governament-has-identified-40-people-as-super-spiders-over-corona-expanding
వామ్మో సూపర్‌ స్ప్రెడర్స్‌... వారి వల్లే 300 మందికి కరోనా..

By

Published : May 11, 2020, 9:44 AM IST

ఆంధ్రప్రదేశ్​లో​ సుమారు 40 మంది నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా జరిగింది. వీరివల్ల సుమారు 300 మందికిపైగా వైరస్‌ సోకినట్లు ఏపీ ప్రభుత్వం తేల్చింది. ఈ 40 మంది నుంచి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ వివరాలు సేకరించి గుర్తించారు. వీరిని వైద్య ఆరోగ్య శాఖ ‘సూపర్‌ స్ప్రెడర్‌’గా పేర్కొంటోంది.

ఈ నెల 5వ తేదీ వరకు సేకరించిన సమాచారం ప్రకారం...

  1. కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి నుంచి ఏకంగా 32 మందికి వైరస్‌ సోకింది. ఒకరి ద్వారా ఇంతమందికి వైరస్‌ సోకడం రాష్ట్రంలో ఇదే ప్రథమం.
    *కృష్ణా జిల్లాలో ఒకరి నుంచి 18 మందికి కరోనా వచ్చింది.
  2. గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి ద్వారా 17 మందికి వైరస్‌ సోకింది. ఈ జిల్లాలోనే పలువురిలో ఒక్కొక్కరు 15 నుంచి ఐదుగురు వంతున వైరస్‌ బారిన పడేందుకు కారణమయ్యారు.
  3. అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాలోనూ ఒక్కొక్క వ్యక్తి నుంచి 12 మందికి వైరస్‌ సోకింది.
  4. ప్రకాశం జిల్లాలో ఇద్దరు వ్యక్తుల నుంచి పది మందికి వైరస్‌ వచ్చినట్లు తేలింది. ఇటువంటి సంఘటనలే మరికొన్ని ఇతర జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.

80శాతం మందిలో లక్షణాలు లేవు

ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌లో 80శాతం మందిలో వైరస్‌ అనుమానిత లక్షణాలు కనిపించలేదని కొవిడ్‌-19 ప్రత్యేక అధికారి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ వివరాలను ఇటీవల కేంద్ర బృందానికి ఆయన వివరించారు.

ABOUT THE AUTHOR

...view details