Andhra girl america boy marriage: నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదని చాలా మంది నమ్మే మాట. ఒకప్పుడు ప్రేమ వివాహనికి ఎన్నో సమస్యలు, మరెన్నో అడ్డంకులు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మనసులు గెలిచిన ప్రేమ... కులమతాల అడ్డుగోడలను పడగొట్టి, ఎళ్లలు దాటి ఏకమవుతోంది. పిల్లల ప్రేమకు పెద్దవాళ్లు సైతం సహకరిస్తున్నారు. తాజాగా ఇలాంటి వివాహం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు, లక్ష్మీ దంపతుల కుమార్తె శ్రావణి, అమెరికా కొలరాడో రాష్ట్రానికి చెందిన హిత్ స్ట్రీట్ల వివాహం ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుక నిర్వహించారు.
ఎలా మొదలైంది...
ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2016లో కొయంబత్తూరులో నిర్వహించే యోగా శిక్షణకు శ్రావణి వెళ్లింది. అక్కడ హిత్ స్ట్రీట్‌తో పరిచయం ఏర్పడింది. అదికాస్త స్నేహంగా మారింది. అనంతరం సాఫ్ట్వేర్ ఉద్యోగిగా రెండేళ్ల కిందట అమెరికా వెళ్లడంతో స్నేహం కాస్త ప్రేమగా మారిందని ఆమె తెలిపింది. అతను అక్కడ మోడలింగ్‌లో రాణిస్తున్నాడని, ఇద్దరూ కలిసి ఆ ప్రాంతంలో హఠయోగా క్లబ్ ప్రారంభించారని శ్రావణి తెలిపింది. ఇరువురి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని ఒక్కటయ్యామని ఆమె పేర్కొంది. కరోనా నిబంధనల కారణంగా తమ వివాహానికి అమెరికా నుంచి తన అత్తమామలు రాలేకపోయారని తెలిపింది.
ఖండాలుదాటిన ప్రేమ.. ఒక్కటైన గోదావరి అమ్మాయి, అమెరికా అబ్బాయి ఇదీ చూడండి :pattu vastralu samarpana: వన దేవతలకు పట్టు వస్త్రాలు సమర్పించిన చంద వంశస్థులు