తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్: ఏపీ ఎస్‌ఈసీ - నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజా వార్తలు

స్థానిక సంస్థలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు కాల్ సెంటర్ ప్రారంభించామని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. గురువారం రోజు 13 జిల్లాల నుంచి 196 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు.

andhra pradesh -sec-nimmagadda-ramesh-kumar-on-complaints-related-to-local-bodies
పంచాయతీ ఎన్నికలపై.. ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్: ఏపీ ఎస్‌ఈసీ

By

Published : Feb 12, 2021, 10:47 AM IST

ఆంధ్రప్రదేశ్​లో స్థానిక సంస్థలకు సంబంధించిన ఫిర్యాదులపై రియల్ టైం విధానంలో పర్యవేక్షణ చేస్తున్నామని ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఎస్‌ఈసీ కాల్‌సెంటర్‌ ద్వారా పర్యవేక్షణ జరుగుతోందన్నారు. గురువారం నుంచి కాల్ సెంటర్ కార్యకలాపాలను ప్రారంభించినట్లు వెల్లడించారు.

తొలి రోజు 13 జిల్లాల నుంచి 196 ఫిర్యాదులు కాల్‌ సెంటర్‌కు వచ్చాయని నిమ్మగడ్డ వివరించారు. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, సీపీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రక్రియను కార్యదర్శి కన్నబాబు, అదనపు డీజీ సంజయ్‌ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సమర్థంగా కార్యకలాపాల నిర్వహణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:అమలులోకి కోడ్​: వాయిదా పడ్డ వేతన సవరణ

ABOUT THE AUTHOR

...view details