ప్రస్తుత నీటి సంవత్సరం కేటాయించిన జలాల్లో మిగిలిన నీటిని వచ్చే ఏడాది వినియోగించుకుంటామన్న తెలంగాణ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ మరోమారు వ్యతిరేకించింది. ఇవాళ జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ అంశం మరోమారు చర్చకు వచ్చింది. సభ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాయిపురే దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
క్యారీ ఓవర్పై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం - Telangana news
ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
మే నెల తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి జలాశయాల నుంచి నీటి విడుదలకు అంగీకరించారు. ప్రస్తుత ఏడాది కేటాయింపుల్లో తమకు 70 టీఎంసీలకు పైగా నీరు ఇంకా ఉందని, ఆ మొత్తాన్ని వచ్చే ఏడాది కేటాయింపులతో కలిపి క్యారీ ఓవర్ కింద వినియోగించుకుంటామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ నారాయణరెడ్డి దీనిపై అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. క్యారీ ఓవర్ సాధ్యం కాదని అన్నట్లు తెలిసింది. ఉగాది పండగ తర్వాత నెలాఖర్లోపు మరోమారు త్రిసభ్య కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి:కరోనా బారినపడి హెడ్ కానిస్టేబుల్ మృతి