తెలంగాణ

telangana

ETV Bharat / state

ap High Court on Amaravati Petitions: అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుపై స్టే యథాతథం - అమరావతి వార్తలు

ap High Court on Amaravati petitions: అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుపై స్టే ఉత్తర్వులు అమలులో ఉంటాయని ఏపీ హైకోర్టు పేర్కొంది. చట్ట నిబంధనల మేరకు అభివృద్ధి కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. రాజధానిపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది.

ap High Court
ap High Court

By

Published : Nov 29, 2021, 3:33 PM IST

ap High Court on Amaravati petitions: ఏపీ రాజధానిపై దాఖలైన వ్యాజ్యాలపై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. రెండు చట్టాల ఉపసంహరణ అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రెండు చట్టాల ఉపసంహరణపై ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఉపసంహరణ బిల్లుల్లో 3 రాజధానులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషన్లపై విచారణ కొనసాగించాలని న్యాయవాది కోరారు. మాస్టర్ ప్లాన్ అమలులో ఉందంటే.. అమరావతే ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు. బిల్లులపై గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక పరిశీలించాలని కోరారు.

పిటిషనర్‌ తరఫు లాయర్లతో త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించలేదు. అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలకు స్టేటస్ కో ఉత్తర్వులు అడ్డంకి కాదని తేల్చిచెప్పింది. చట్ట నిబంధనల మేరకు అభివృద్ధి కొనసాగించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. కార్యాలయాల తరలింపుపై మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది. రాజధాని వ్యాజ్యాలపై విచారణ డిసెంబర్‌ 27కు వాయిదా పడింది. ప్రభుత్వం ఉపసంహరించుకున్న చట్టాలకు గవర్నర్ ఆమోదం పెండింగ్​లో ఉంది. గవర్నర్‌ ఆమోదం పెండింగ్‌లో ఉన్నందున హైకోర్టు విచారణ వాయిదా వేసింది.

ఇదీ చూడండి:Affidavit On Amaravathi: పాలనా వికేంద్రీకణ బిల్లును ఉపసంహరించుకున్నాం.. హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్

ABOUT THE AUTHOR

...view details