ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 45,592మంది నమూనాలు పరీక్షించగా 771 కొత్త కేసులు నమోదయ్యాయి(ap covid cases). ఎనిమిది మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,333 మంది కోలుకున్నారు.
covid cases updates in ap : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 771 కొవిడ్ కేసులు - ఏపీలో కరోనా కేసులు తాజా వార్తలు
ఏపీలో కొత్తగా 771 కొవిడ్ కేసులు నమోదయ్యాయి(ap covid cases). కొవిడ్ నుంచి 1,333 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,912 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
![covid cases updates in ap : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 771 కొవిడ్ కేసులు ap covid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13204376-386-13204376-1632878608952.jpg)
ap covid
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 11,912 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కడప జిల్లాలో ఒకరు, కృష్ణాలో ఒకరు మరణించారు.
ఇదీ చూడండి:కేరళలో 11వేల కరోనా కేసులు- ఆంక్షలు పొడిగింపు