హైదరాబాద్ ఉప్పల్‌లో ఓ బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సౌత్ స్వరూప నగర్లో నివాసముంటున్న బాల సుందర్(38) ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కింగ్ కోఠిలోని ఆంధ్రాబ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా సుందర్ పని చేస్తున్నాడు.
ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య - CRIME NEWS
హైదరాబాద్ కింగ్‌కోఠిలోని ఆంధ్రాబ్యాంక్ సీనియర్ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉప్పల్‌లో నివాసముంటున్న మేనేజర్ ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆంధ్రబ్యాంక్ సీనియర్ మేనేజర్ ఆత్మహత్య
తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని సుందర్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:దేశంలో కరోనా వైరస్ రూపాంతరం చెందుతోందా?