రేపు ఏపీ పదో తరగతి ఫలితాలు (Tenth results) విడుదల కానున్నాయి. రేపు సాయంత్రం ఐదు గంటలకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేశ్ ఫలితాలు విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు.
కరోనా (covid effect) దృష్ట్యా పదో తరగతి పరీక్షలను (Tenth results) ప్రభుత్వం రద్దు చేయగా.. ఫలితాల (Tenth results) వెల్లడికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 50 మార్కులకు పెట్టిన ఫార్మేటివ్ పరీక్షలో.. 20 మార్కుల రాత పరీక్షకు 70 శాతం, ఇతర 30 మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు 50 మార్కుల చొప్పున రెండు ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో రాత పరీక్షకు 20 మార్కులు, ప్రాజెక్టులకు 10, నోటు పుస్తకాల రాతకు 10, తరగతిలో పిల్లల భాగస్వామ్యానికి 10 మార్కులు కేటాయించారు. పరీక్ష మొత్తం 50 మార్కుల సగటు తీసుకోగా.. దీనిలో 70 శాతం అంటే 35 మార్కులను వెయిటేజీగా తీసుకుంటారు. రాత పరీక్ష 20 మార్కులను 35కు తీసుకువస్తారు.