మెగా బ్యాంకులు, మెగా విలీనాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చే లాభం ఏమి లేదని ఆల్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్ అన్నారు. యూనియన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్‌ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ కోఠిలోని ఆంధ్రాబ్యాంక్ కార్యాలయం ముందు ఉద్యోగులు విధులు బహిష్కరించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విలీనం వల్ల ప్రజలు నష్టపోతారని అన్నారు. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ స్థాయిలో బ్యాంకింగ్ వ్యవస్థ కుంటుపడుతుందన్నారు.
విధులు బహిష్కరించిన ఆంధ్ర బ్యాంకు ఉద్యోగులు - నిరసన
మెగా బ్యాంకుల విలీనాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చే అదనపు ప్రయోజనం ఏమి లేదని ఆల్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయిస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ డి.అశోక్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు.
విధులు బహిష్కరించిన ఆంధ్ర బ్యాంకు ఉద్యోగులు
96 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆంధ్ర బ్యాంక్‌ను, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకుల్లో విలీనం చేయడాన్ని తప్పుబట్టారు. బ్యాంకింగ్ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో కేంద్రీకృతం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందన్నారు. విలీన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఉద్యోగులు ఐక్యమై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి :ఈటల మంత్రి పదవికి ఢోకాలేదు: ఎర్రబెల్లి
Last Updated : Sep 1, 2019, 9:19 AM IST