తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆడియో వైరల్: అనంతపురంలో అంత్యక్రియలకు రూ.60 వేలు - anantapur dst govt hospital news

ఏపీలోని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణాలు ఆగటం లేదు. ఇక్కడ చికిత్సలు సరిగా అందక, ఆక్సిజన్ లేక చనిపోతున్న సంఘటనలే కాదు.. కనీసం వీల్​చైర్లు లేక చేతుల మీద మోసుకొస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాదు రోగులు చనిపోతే కరోనా బూచిగా చూపి అంత్యక్రియలకు వేలకు వేలు గుంజే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. తాజాగా ఆస్పత్రి సిబ్బంది బేరాలాడిన ఆడియో ఒకటి వైరల్ అయింది.

anantapur-dst-govt-hospital-staff-take-too-much-money-from-corona-victim-families
అంత్యక్రియలకు రూ.60 వేలు డిమాండ్​.. ఆస్పత్రి సిబ్బంది ఆడియో వైరల్

By

Published : Jul 27, 2020, 7:39 PM IST

అంత్యక్రియలకు రూ.60 వేలు డిమాండ్​.. ఆస్పత్రి సిబ్బంది ఆడియో వైరల్

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది పేదల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. కరోనాతో చనిపోతే పేదలు అంత్యక్రియలకు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఒక నిరుపేద వ్యక్తి అంత్యక్రియలకు రూ.60 వేలు డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

రెండు రోజుల క్రితం నందమూరినగర్​కు చెందిన బొమ్మయ్య అనే వ్యక్తి ఊపిరాడని పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చాడు. అయితే అక్కడ కనీసం వీల్​చైైర్ కూడా లేకపోవటంతో బంధువులు చేతుల మీద తీసుకెళ్లి అడ్మిట్ చేశారు. బొమ్మయ్య చికిత్స పొందుతూ చనిపోయాడు.

వార్డులోని సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించేందుకు రూ.60 వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ.45 వేలకు తక్కువ చేయమని తెగేసి చెప్పారు. వారు డబ్బు డిమాండ్ చేసిన ఆడియో వైరల్​గా మారింది.

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స సరిగా అందకపోవటమే కాకుండా.. ఇలా చనిపోయిన తరువాత కూడా జలగల్లా పీడిస్తుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:తుది దశకు సచివాలయ భవనాల కూల్చివేత

ABOUT THE AUTHOR

...view details