'బాలికే భవిష్యత్తు' కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు ఒక్క రోజు కలెక్టర్గా విధులు నిర్వర్తించిన విద్యార్థి శ్రావణిని కలెక్టర్ గంధం చంద్రుడు అభినందించారు. బాలికను ఉన్నత చదువులు చదివించాలని ఆమె తల్లిదండ్రులకు సూచించారు. అందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తానని వారికి కలెక్టర్ చంద్రుడు హామీ ఇచ్చారు. గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామంలోని విద్యార్థిని శ్రావణి ఇంటికి కలెక్టర్ గురువారం వెళ్లారు. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి వారి బాగోగులను తెలుసుకున్నారు.
ఒక్క రోజు కలెక్టర్కు 'చంద్రుడు' సాయం - Andhra Pradesh Latest News
ఏపీలోని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మంచి మనసు చాటుకున్నారు. ఒక్కరోజు కలెక్టర్గా విధులు నిర్వర్తించిన ఇంటర్ విద్యార్థిని శ్రావణి చదువుకు అవసరమైన సహాయాన్ని అందిస్తానని భరోసా ఇచ్చారు. బాలికను బాగా చదివించాలని ఆమె తల్లిదండ్రులకు కలెక్టర్ సూచించారు.
'విద్యార్థిని శ్రావణికి వచ్చిన అవకాశం కొద్ది మందికి మాత్రమే వస్తుంది. ఆమెను బాగా చదివించండి. చదువుకు ఏ సహాయం కావాలన్నా చేస్తాం. అమ్మాయి పేరు మీద బ్యాంకు ఖాతా తెరచి కొంత డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఆ డబ్బును అమ్మాయి చదువు కోసం ఉపయోగించండి' అని బాలిక తల్లిదండ్రులకు కలెక్టర్ సూచించారు. భవిష్యత్తులో కలెక్టర్ అయ్యేలా బాగా చదువుకోవాలని శ్రావణికి చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినికి చదువు చెప్పిన ఉపాధ్యాయురాలు నాగవేణికి కలెక్టర్ ఫోన్ చేసి అభినందించారు.
- ఇదీ చూడండి:ఆర్డీఎస్కు సహకరించడం లేదు: తెలంగాణ