Anant Ambani at Tirumala : తిరుమల శ్రీవారిని ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తనకు కాబోయే అర్ధాంగితో కలిసి ఆయన స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఇటీవలె రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీల రెండో తనయుడు అనంత్ అంబానీకి, విరెన్ మర్చంట్, శైల దంపతుల కుమార్తె రాధికా మర్చంట్‌కు అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది. ముంబయిలోని అంబానీల నివాసమైన ఆంటిలియాలో నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు. గుజరాతీ, హిందూ కుటుంబ సంప్రదాయాలను అడుగడుగునా పాటించారు.