ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి ఇప్పటిదాకా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో.... అది మెల్లగా సాగుతోంది. సర్వేపల్లి నియోజకవర్గ వాసులకు రెండు రోజులు పంపిణీ చేసి నిలిపివేశారు.
Anandaiah Medicine: నత్తనడకన.. ఆనందయ్య మందు పంపిణీ! - ఆనందయ్య మందు తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆనందయ్య ఔషధానికి అనుమతులు వచ్చి రోజులు గడుస్తున్నా.. పంపిణీ నత్తనడకన సాగుతోంది. సర్వేపల్లి నియోజకవర్గం తర్వాత అన్ని ప్రాంతాల్లో వాలంటీర్ల ద్వారా మందు ఇస్తారని భావించినా అది జరగట్లేదు. దూర ప్రాంతాల నుంచి కృష్ణపట్నం వస్తున్నవారు.. అక్కడ మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు.

Anandaiah Medicine
నత్తనడకన.. ఆనందయ్య మందు పంపిణీ!
మందు తయారీకి ఆనందయ్య బృందమున్నా... సామగ్రి కొరత, తయారీ యంత్రాల లేమి వేధిస్తున్నాయి. వాలంటీర్ల ద్వారా పంపిణీని గొలగమూడిలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. మనుబోలులోనూ మందు పంపిణీ మొదలైంది. జిల్లా అంతటా ఈ విధానం అమల్లోకి రావాలని ప్రజలు కోరుతున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. పెద్ద ఎత్తున పంపిణీకి ఉన్న సమస్యలను వివరిస్తూ ఆనందయ్య ముఖ్యమంత్రికి లేఖ రాశారు.