కొన్ని ఆటంకాల వల్ల ఔషధ పంపిణీ సవ్యంగా సాగట్లేదని కృష్ణపట్నం ఆనందయ్య అన్నారు. పంపిణీకి సరిపడా వనరులు సమకూరడం లేదని.. విద్యుత్ సౌకర్యం, ఔషధ తయారీ యంత్ర సామగ్రి లేదని తెలిపారు. ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప సహకారం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Anandaiah Medicine: 'అనుమతులే తప్ప సహకారం లేదు' - ap latest news
ఔషధ పంపిణీకి ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప సహకారం లేదని కృష్ణపట్నం ఆనందయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాలకు ఔషధం అందిస్తామన్నారు. ఇవాళ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకే ఔషధం అందిస్తామని స్పష్టం చేశారు.
Anandaiah Medicine
ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాలకు ఔషధం అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకే ఔషధం అందిస్తామని.. కృష్ణపట్నంలో ఔషధ పంపిణీ కొనసాగుతోందని ఆనందయ్య తెలిపారు. స్థానికేతరులు ఎవరూ కృష్ణపట్నం రావొద్దని కోరారు.
ఇదీ చూడండి: Anandaiah medicine: ఇవాళ్టి నుంచి ఆనందయ్య ఔషధం పంపిణీ
Last Updated : Jun 7, 2021, 12:22 PM IST