ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి రహస్య ప్రాంతానికి ఆనందయ్య తరలించారు. తెల్లవారుజామున ప్రత్యేక పోలీసు బంధోబస్తుతో తీసుకెళ్లారు. ఆనందయ్య మందు కోసం.. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు కృష్ణపట్నం వస్తున్నారు. ఆనందయ్య కోసం వస్తున్న వారికి పోలీసులు అనుమతి నిరాకరించారు. మరోవైపు కృష్ణపట్నంలో 144 సెక్షన్ ఉంది.
ఆనందయ్య మందు పంపిణీపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నెల 21 నుంచి ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది. తుది నిర్ణయం తీసుకునే వరకు రహస్య ప్రాంతంలోనే ఆనందయ్యను ఉంచనున్నారు.