ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఔషధ పంపిణీ ఉంటుందని ఆనందయ్య(Anandaiah Medicine) వెల్లడించారు. కరోనా మందు పంపిణీపై ఏపీలోని నెల్లూరులో కలెక్టర్ చక్రధర్ బాబుతో ఆనందయ్య సమావేశమయ్యారు. ముడిసరుకు సమీకరించి రెండు, మూడు రోజుల్లో ఔషధం తయారీని ప్రారంభిస్తామని తెలిపారు. కరోనా మందు తయారీకి సహకరించేందుకు పలువురు ముందుకు వస్తున్నారని చెప్పారు. తయారీ ప్రక్రియ పూర్తైతే, సోమవారం నుంచే మందు పంపిణీ ప్రారంభిస్తామన్నారు.
Krishnapatnam: ఆన్లైన్లో ఆనందయ్య మెడిసిన్ - నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబుతో ఆనందయ్య సమావేశం
కరోనా మందు పంపిణీపై ఏపీలోని నెల్లూరులో కలెక్టర్ చక్రధర్బాబుతో ఆనందయ్య(Anandaiah Medicine) సమావేశమయ్యారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఔషధ పంపిణీ ఉంటుందని ఆనందయ్య వెల్లడించారు. కరోనా మందు ప్రక్రియ పూర్తైతే, సోమవారం నుంచే మందు పంపిణీ ప్రారంభిస్తామన్నారు.
ఆనందయ్య
అధికారులు నిర్ణయించిన ప్రకారమే.. మందు పంపిణీ చేస్తామని, అవసరమైన వారందరికి ఔషధాన్ని అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. మందుకోసం అవసరమైతే యాప్‌నురూపొందించి...కావాల్సినవారికి అందజేస్తామని నెల్లూరుజిల్లా కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి:DGP: లాక్‌డౌన్, కర్ఫ్యూ ఉల్లంఘనలపై 2.61లక్షల కేసులు
Last Updated : Jun 1, 2021, 8:16 PM IST