దిశ అత్యాచారం, హత్య కేసులో పోలీసులకు కీలకమైన శాస్త్రీయ ఆధారాలు లభించాయి. ఆమెపై అత్యాచారానికి పాల్పడింది ఆ నలుగురు నిందితులేనని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. ఆ నివేదిక సైబరాబాద్ పోలీసులకు అందింది. ఇది ఈ కేసుకు బలమైన సాక్ష్యం కానుంది.
అఘాయిత్యానికి పాల్పడింది ఆ నలుగురే - The DNA analysis stated that the body was dead.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో కీలకమైన శాస్త్రీయ ఆధారాలు లభించాయి. ఆమెపై అత్యాచారానికి పాల్పడింది ఆ నలుగురు నిందితులేనని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు.
![అఘాయిత్యానికి పాల్పడింది ఆ నలుగురే Analysis of the DNA reveals that the disha body was dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5356704-1024-5356704-1576187241898.jpg)
మృతదేహం దిశదేనని డీఎన్‌ఏ విశ్లేషణలో వెల్లడి
తొండుపల్లి రింగ్‌రోడ్డు జంక్షన్‌కు సమీపంలోని ఘటనాస్థలిలో లభించిన ఆమె లోదుస్తులకు అంటిన వీర్యకణాలను పోలీసులు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అవి ఇద్దరు నిందితులకు సంబంధించినవిగా నిపుణులు తేల్చారు. మృతదేహాన్ని దహనం చేసిన చోట స్వాధీనం చేసుకున్న చున్నీపై లభించిన వీర్యకణాలు మరో ఇద్దరు నిందితులకు సంబంధించినవిగా గుర్తించారు.
ఇదీ చూడండి : బంజారాహిల్స్‌లో వ్యక్తి దారుణ హత్య