హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ ఠాణా పరిధిలో యువతితో సహా ఓ మహిళ కనిపించడం లేదని వేర్వేరు ఫిర్యాదులు అందాయి. మాదాపూర్ ఇమేజ్ గార్డెన్ సమీపంలో నివాసం ఉండే చిన్నపాగా అలవేలు, తిరుపతయ్య దంపతుల కుమార్తె 19 ఏళ్ల అనురాధ కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు తెలిసిన ప్రాంతాల్లో వెతికారు. ఫలితం లేకపోవడం వల్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు.
ఇద్దరు మహిళల మిస్సింగ్... పోలీసుల వెతుకులాట! - 'యువతితో సహా ఓ మహిళా మిస్సింగ్... కేసు నమోదు'
ఇద్దరు మహిళలు కనిపించకుండా పోయారు. మాదాపూర్ ఠాణాలో వేర్వేరు ఫిర్యాదులు అందాయి.
![ఇద్దరు మహిళల మిస్సింగ్... పోలీసుల వెతుకులాట! మిస్సింగ్ మహిళల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5308699-thumbnail-3x2-missing.jpg)
మిస్సింగ్ మహిళల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు
ఇంటికి వస్తున్నానని చెప్పి...
హైదరాబాద్ యూసఫ్ గూడలో నివాసం ఉంటున్న బెగారి సునీత మాదాపూర్లోని బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. ఉదయం పదకొండు గంటలకు డ్యూటీకి వెళ్లిన సునీత రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వస్తున్నానని చెప్పింది. కానీ ఆ తర్వాత రాలేదు. కుటుంబ సభ్యులు మాదాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మిస్సింగ్ మహిళల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు
TAGGED:
Madapur_Missings