తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి - AN WOMEN DEAD

వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటన హైదరాబాద్​ నగరంలోని ముషీరాబాద్​లో చోటు చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలింపు

By

Published : May 5, 2019, 12:16 AM IST

వైద్యుని నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందిందని ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన హైదరాబాద్​లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. షాద్​నగర్​కు చెందిన పొలం సత్తమ్మకు తుంటి ఎముక విరిగింది. స్థానిక వైద్యుని సూచన మేరకు రోగిని రాంనగర్​లోని సౌమ్య ఆసుపత్రికి తరలించారు.

సౌమ్య ఆస్పత్రి వైద్యులు తమకు సమాచారం ఇవ్వకుండా ఆపరేషన్ నిర్వహించడం వల్లే ఆమె మృతి చెందిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ చేసిన వైద్య బృందం పరారీలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

పరారీలో ఉన్న వైద్య బృందం

ఇవీ చూడండి : రెండు గంటల ముందు నుంచే లోనికి అనుమతి

ABOUT THE AUTHOR

...view details