తెలంగాణ

telangana

ETV Bharat / state

డీజిల్​ పోసుకున్నారు... డబ్బులిమ్మంటే కొట్టారు...! - పెట్రోల్ బంక్

అది అసలే అర్ధరాత్రి సమయం... డీజిల్​ కోసం ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. సిబ్బంది కూడా వెంటనే వారు తెచ్చుకున్న డబ్బాలో డీజిల్ నింపారు. అప్పటి వరకు బాగానే ఉన్న ఆ వ్యక్తులు డబ్బులు ఇమ్మని అడగ్గానే... శివాలెత్తిపోయారు. వెంటనే దోస్తులను పిలిపించి పెద్ద గొడవ చేశారు. సిబ్బందిని, మేనేజర్​ని తీవ్రంగా కొట్టారు.

An unidentified persons attack on a petrol bunk crew

By

Published : Sep 13, 2019, 7:53 PM IST

హైదరాబాద్​ బల్కంపేటలోని ఓ పెట్రోల్ బంక్​ సిబ్బందిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. గురువారం అర్ధరాత్రిపూట డీజిల్ కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు డబ్బులు ఇవ్వకుండా గొడవకు దిగారు. మద్యం మత్తులో పెట్రోల్ బంక్ సిబ్బందిని దుర్భాషలాడారు. వారి స్నేహితులకు ఫోన్ చేసి మరీ పిలిపించుకున్నారు. ఆరుగురు వ్యక్తులు సిబ్బందిపై దాడి చేస్తుండగా... అడ్డొచ్చిన మేనేజర్​ని కూడా గాయపరిచారు. సిబ్బంది చేతిలో ఉన్న క్యాష్ బ్యాగును లాక్కోడానికి ప్రయత్నించారు. చుట్టూ ఉన్న వ్యక్తులు గొడవ దగ్గరికి చేరుకోవటం వల్ల దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దాడిలో బంక్ మేనేజర్ స్వామిగౌడ్, సిబ్బంది నరేష్​కు తీవ్ర గాయాలు కావంటం వల్ల ఆస్పత్రికి తరలించారు. పెట్రోల్ బంక్ డీలర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులు ఎస్సానగర్​లోని బాపునగర్​కి చెందినవాళ్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

డీజిల్​ పోసుకున్నారు... డబ్బులిమ్మంటే కొట్టారు...!

ABOUT THE AUTHOR

...view details