ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టిన ఘటనలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్ సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. రైలు పట్టాల పక్కన బహిర్భూమికి వెళ్లినప్పుడు రైలు ఢీ కొని ఉంటుందని అనుమానిస్తున్నారు. తీవ్రగాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతుడు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎంఎంటీస్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి - mmts
సికింద్రాబాద్ సనత్‌నగర్ ఠాణా పరిధిలోని భరత్‌నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎంఎంటీస్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి