మౌలాలి రైల్వే స్టేషన్ వద్ద రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. లాలాగూడ మౌలాలి రైల్వే స్టేషన్ నడుమ ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో అతని తలకు తీవ్రమైన గాయం అవ్వడం వల్ల అక్కడికక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి సమాచారాన్ని తెలుసుకునే పనిలో రైల్వే పోలీసు నిమగ్నమయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి - హైదరాబాద్ వార్తలు
రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మౌలాలి రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి వివరాల కోసం రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి వ్యక్తి మృతి