తెలంగాణ

telangana

ETV Bharat / state

రాయితీపై ఎలక్ట్రానిక్ వస్తువులు ఇస్తామని..బోర్డు తిప్పేసిన సంస్థ - సుమారు మూడు కోట్ల రూపాయల వరకు వసూలు

గృహోపకరణాలను రాయితీపై ఇస్తామంటూ రుసుములు కట్టించుకున్న ఓ సంస్థ బోర్డు ఎత్తేసింది. తమ డబ్బులు చెల్లించాలంటూ సంస్థ ఉద్యోగులను బాధితులు డిమాండ్ చేయడం వల్ల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

తక్షణమే మాకు న్యాయం చేయాలి : సంస్థ ఉద్యోగులు

By

Published : Sep 9, 2019, 5:05 PM IST

రాయితీపైఎలక్ట్రానిక్ వస్తువులుఇస్తామంటూ కస్టమర్ల నుంచి సుమారు మూడు కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన హిమోగుల్ సంస్థ బోర్డు తిప్పేసింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఉద్యోగులే కస్టమర్లకు ఫోన్లు చేసి వస్తువుల కోసం లక్షల్లో డబ్బులు కట్టించారు. వినియోగదారులు మాత్రం తాము చెల్లించిన డబ్బులు ఉద్యోగులే చెల్లించాలని అనటం వల్ల వారు పోలీసులను ఆశ్రయించారు.

సంస్థలో పనిచేస్తున్న ఒక్కొక్క ఉద్యోగి వారి బంధువుల చేత కూడా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కట్టించారు. తమ డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు వాపోయారు. బేగంపేట పోలీసులు కేసును సీసీఎస్​కు అప్పగించారు. ప్రస్తుతం సంస్థ యాజమాని తస్లిమ్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు.

తక్షణమే న్యాయం చేయాలి : సంస్థ ఉద్యోగులు

ఇవీ చూడండి : డీడీలు కట్టినా.. వాహనాలు రాలేదు

ABOUT THE AUTHOR

...view details