Death of old women: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలోని మానకొండ వారి పాలెంలో షేక్ నాగూర్ బి (68) అనే మహిళ కోతి కరిచి మృతి చెందింది. కోతుల గుంపు దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె ఇంటికి వచ్చి శనివారం మృతి చెందింది. గత గురువారం ఇంటి వద్ద టీ తాగుతుండగా షేక్ నాగూర్ బి మీద కోతుల గుంపు దాడి చేయడంతో కుడి చేయి మోచేతికి గాయాలయ్యాయి.
కోతి కరచి వృద్ధురాలు మృతి ఎక్కడంటే.. - వృద్ధురాలి మరణం
Death of old women: ఏపీలో కోతి కరచి వృద్ధురాలు మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో జరిగింది. ఇంటి వద్ద టీ తాగుతుండగా ఆమెపై కోతుల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో ఆమె చేతికి గాయాలయ్యాయి. అనంతరం చికిత్స పొందుతూ ఇంటి వద్ద మృతి చెందింది.
పల్నాడులో కోతి కరచి వృద్ధురాలు మృతి
గాయపడిన నాగూర్ బీని ఆమె కుమార్తె మస్తాన్ బి చిలకలూరిపేట పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి ఇంటికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం నాగూర్ బి మృతి చెందింది. గత సంవత్సరం నుంచి కోతులను బంధించాలని పురపాలక అధికారులకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యం కారణంగా నాగూర్ బీ మృతి చెందిందని బంధువులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: