బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వృద్ధుడు రాత్రంతా లాకర్ గదిలో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని యూనియన్ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. 87 ఏళ్ల కృష్ణారెడ్డి సోమవారం సాయంత్రం బ్యాంకుకు వెళ్లారు. సిబ్బంది అనుమతితో లాకర్ గదిలోకి వెళ్లిన కృష్ణారెడ్డి... తిరిగి వచ్చేసరికి తాళం వేశారు. చేసేదేమీ లేక కృష్ణారెడ్డి లోపలే ఉండిపోయాడు. చీకటి పడినా కృష్ణారెడ్డి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం.. 18 గంటలపాటు లాకర్ గదిలోనే వృద్ధుడు - An old man trapped in a union bank locker
11:36 March 29
యూనియన్ బ్యాంకు సిబ్బంది నిర్వాకం
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు చూసి బ్యాంకు లాకర్ గదిలో ఉన్నట్లు గుర్తించారు. ఉదయం 10 గంటలకు బ్యాంకు లాకర్ నుంచి ఆ వృద్ధుడిని పోలీసులు బయటకు తీసుకుని వచ్చారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంపై కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చక్కెర వ్యాధి, రక్తపోటు సమస్యలతో కృష్ణారెడ్డి బాధపడుతున్నారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
లాకర్ గదిలో వృద్ధుడిని గమనించని సిబ్బంది పొరపాటున తాళం వేశారని జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంకు మేనేజర్ తెలిపారు. సమ్మె వల్ల నిన్న సిబ్బంది తక్కువగా వచ్చారని... రోజు గదికి లాకర్ వేసే వ్యక్తి కాకుండా మరో వ్యక్తి తాళం వేయడంతో ఈ పొరపాటు జరిగిందని వివరించారు. లాకర్ గది, బ్యాంకు మొత్తాన్ని పరిశీలించిన తర్వాతే తాళం వేయాల్సి ఉన్నప్పటికీ... నిన్న పొరపాటు వల్ల వృద్ధుడు లాకర్ గదిలో ఉన్న విషయాన్ని చూసుకోలేదని బ్యాంకు మేనేజర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్ కార్లకు జరిమానా.. ఎందుకంటే..?