హైదరాబాద్ పాతబస్తీ కామాటిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పురాతన ఇల్లు కూలింది. ఇంట్లో నివాసం ఉండే ఇద్దరికి ప్రమాదం తప్పింది. బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంటిపై కప్పు నుంచి మట్టి రాలడాన్ని ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తి గమనించాడు. దీంతో అప్రమత్తమై బయటకు పరుగెత్తడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
కూలిన పురాతన ఇల్లు.. తప్పిన ప్రమాదం - కూలిన పురాతన ఇల్లు పాతబస్తీ
హైదరాబాద్లో వరుణుడి బీభత్సానికి అనేక ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఎంతో మంది నివాసాలు పోగొట్టుకుని నిరాశ్రయులు అయ్యారు. వర్షం కారణంగా పురాతన ఇళ్లు, గోడలు కూలిపోతున్నాయి. తాజాగా పాతబస్తీ కామాటిపురా పరిధిలో ఓ పురాతన ఇల్లు కూలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
![కూలిన పురాతన ఇల్లు.. తప్పిన ప్రమాదం కూలిన పురాతన ఇల్లు.. తప్పిన ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9253704-thumbnail-3x2-house.jpg)
కూలిన పురాతన ఇల్లు.. తప్పిన ప్రమాదం