తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Assembly Sessions 2023 : అసెంబ్లీ సమావేశాల వేళ ఆసక్తికర సన్నివేశాలు.. ఈటల, జగ్గారెడ్డితో మంత్రి కేటీఆర్ ముచ్చట్లు - మంత్రి కేటీఆర్ తాజా వార్తలు

Interesting Scene Between KTR and Jaggareddy : రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ ఇవాళ శాసనసభలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఎప్పుడు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకునే రాజకీయ నేతలు ఇవాళ కొద్దిసేపు ఆప్యాయంగా పలకరించుకున్నారు. సమావేశాల ప్రారంభానికి ముందు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, జగ్గారెడ్డిల మధ్య చోటుచేసుకున్న సంభాషణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Jaggareddy Meets KTR
Jaggareddy Meets KTR

By

Published : Aug 3, 2023, 4:12 PM IST

Telangana Assembly Sessions 2023 : రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొంతకాలం క్రితం మృతిచెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు శాసనసభ నివాళులర్పించింది. సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు. 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసన సభ్యుడిగా, ఇతర అనేక హోదాల్లో పనిచేసిన సాయన్న... జీహెచ్​ఎంసీలో కంటోన్మెంట్‌ను కలిపేందుకు ఎంతో కృషి చేశారన్నారు. సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం, మంత్రులు, విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు సాయన్న సేవలను కొనియాడారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదాపడింది.

Interesting Scene between KTR and Etela : ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు గురువారం శాసనసభలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఉదయం పదకొండున్నరకు సమావేశాలు ప్రారంభంకానుండగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో శాసనసభలోకి వచ్చిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్లి పలకరించారు. అనంతరం ఇద్దరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు దాదాపు 10 నిమిషాలపాటు ముచ్చటించారు.

An Interesting Conservation Between KTR and Jaggareddy : ఆ తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి కేటీఆర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. శాసనసభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీ షర్డ్ వేసుకుని వచ్చారు. ఆ సమయంలో టీ షర్ట్‌లో ఉన్న జగ్గారెడ్డిని చూసిన మంత్రి కేటీఆర్... పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లన్న? అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. టీ షర్ట్‌తో వేసుకుంటే పిల్లలవుతారా? అని ఎదురు ప్రశ్నించారు. అప్పటికే జగ్గారెడ్డితో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ కలిసి ఉండగా.. మీ ఇద్దరికి దోస్తాన్‌ ఎక్కడ కుదిరిందని కేటీఆర్ అడిగారు. దీంతో ‘మాది ఒకే కంచం.. ఒకే మంచమని’ కేటీఆర్ అడిగిన ప్రశ్నకు మామిల్ల రాజేందర్ జవాబిచ్చారు. అయితే, జగ్గారెడ్డిని గెలిపిస్తావా? అని రాజేందర్​ను మంత్రి కేటీఆర్ ప్రశ్నించగా.. ‘సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తా.. మన దగ్గరకు పట్టుకొస్తా అని’ మామిల్ల రాజేందర్‌ సరదాగా వ్యాఖ్యానించారు.

ఈటల, జగ్గారెడ్డితో మంత్రి కేటీఆర్ ముచ్చట్లు

ఎర్రబెల్లిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు :అదేవిధంగా అసెంబ్లీ లాబీలో మంత్రి ఎర్రబెల్లిని కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పోటెత్తిన వరదలతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే వరద ప్రభావిత ప్రాంతాలలో చర్యలు చేపట్టాలని కోరారు. శాసనసభకు మరల శుక్రవారం ఉదయం ప్రారంభంకానుండడంతో..అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే చిట్టచివరి సమావేశాలుగా వీటిని భావిస్తుండగా... ఈసారి సభాపర్వం వేడి, వాడి సాగే అవకాశం ఉంది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details