వన్డే ప్రపంచ కప్ జరుగుతున్న ఇంగ్లండ్‌లో.. తెలుగు వికసించింది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్‌కు వేదికైన మాంచెస్టర్‌లో.. మన తెలుగువాళ్లే ఆశ్చర్యపోయేలా ఓ వ్యక్తి స్పష్టమైన తెలుగులో మాట్లాడాడు. ఆట చూసేందుకు వెళ్లిన కొందరు ఆంధ్రులు ఓ దుకాణానికి వెళ్లగా.. వారు షాక్ అయ్యేలా పలకరించాడు. ''తెలుగులో చెప్పండి.. ఇంగ్లీష్‌లో కాదు'' అంటూ.. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడాడు. ''తెలుగును మరిచిపోవద్దు.. మంచి భాష'' అంటూ ఆంధ్ర భాషపై మమకారాన్ని చాటుకున్నాడు. తాను రెండేళ్ల పాటు.. ఆంధ్రప్రదేశ్‌లోని.. విశాఖ, విజయవాడలో ఉన్నానని చెప్పాడు. ''మీరంతా ఏ ఊరి నుంచి వచ్చారు?'' అని ఆప్యాయంగా పలకరించాడు. ఇంగ్లండ్ కు చెందిన వ్యక్తి.. అంతటి తేట తెలుగు మాట్లాడేసరికి మనవాళ్లు ఆనందంతో చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు.
ఇంగ్లండ్ యువకుడి నోట.. వెల్లువలా తేట తెలుగు మాట - ప్రపంచకప్ సెమీస్
ఈ మధ్య మనవాళ్లే తెలుగు సరిగా మాట్లాడడం లేదు. పరాయి భాషపై మోజుతో మాతృభాషను పక్కన పెట్టేస్తున్నారు. కానీ.. ఎక్కడో వేల మైళ్ల అవతల.. ఇంగ్లండ్‌లో ఓ వ్యక్తి.. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. తనతో తెలుగులోనే మాట్లాడాలంటూ ఆకట్టుకున్నాడు.
ఇంగ్లండ్ యువకుడి నోట తెలుగు మాట