తెలంగాణ

telangana

ETV Bharat / state

రోజుకు సగటున 60 రోడ్డు ప్రమాదాలు

తెలంగాణలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా సగటున ప్రతి గంటంపావుకో ప్రాణం పోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంభవిస్తున్న ప్రమాదాలు రోజుకు సగటున 60 వరకు ఉంటున్నాయి. ప్రతి గంటకు ఒకరు క్షతగాత్రులవుతున్నారు. గతేడాది రాష్ట్రంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాద గణాంకాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి.

An average of 60 road accidents per day in Telangana
రోజుకు సగటున 60 రోడ్డు ప్రమాదాలు

By

Published : Mar 13, 2020, 6:31 AM IST

రోజుకు సగటున 60 రోడ్డు ప్రమాదాలు

రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు నిఘా విస్తృతంగానే అమలు చేస్తున్నా.. ఉల్లంఘనల దూకుడు తగ్గడంలేదు. నగరాలు పట్టణాల్లోని ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసిన వేలాది సీసీ కెమెరాలతో పాటు పోలీస్ సిబ్బంది చేతుల్లోని కెమెరాలతో ఉల్లంఘనలను చిత్రీకరించే ప్రక్రియ నిరంతరం కొనసాతుంది. దీనికితోడు గ్రామీణ ప్రాంతాల్లో తరచూ వాహన తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు.

గతేడాది 1.2కోట్ల కేసులు నమోదు

డ్రంకన్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, శిరస్త్రాణం ధరించకపోవడం, సీటుబెల్టు పెట్టుకోకపోవడం తదితర ఉల్లంఘనలను పోలీసులు తీవ్రం​గా పరిగణిస్తున్నారు. ఇంత చేస్తున్నా.. గతేడాది ట్రాఫిక్ ఉల్లంఘనలపై 1.2 కోట్ల కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 32,877 ఉల్లంఘనలున్నట్లు పోలీసులు లెక్కలేస్తున్నారు.

కోట్లలో జరిమానాలు...

ట్రాఫిక్ విధుల్లో రోడ్లపై ఉండే పోలీసులు , కంట్రోల్ రూంలో సీసీ కెమెరాలను పర్యవేక్షించే సిబ్బంది నిత్యం వేల సంఖ్యలో ఉల్లంఘనల్ని నమోదు చేస్తున్నారు. గతేడాది వందల కోట్ల రూపాయాలలో జరిమానాలు విధించడం గమనార్హం. ఉల్లంఘనుల నుంచి వసూలు చేసిన జరిమానాల మొత్తమే రూ. 356.96 కోట్లు ఉండటం గమనించదగ్గ విషయం. పోలీసులు విధిస్తున్న జరిమానాల్లో కేవలం 40శాతం మాత్రమే వసూలవుతున్నాయంటే విధిస్తున్న జరిమానాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇదీ చూడండి:బోయింగ్ సిములేటర్ కాక్​పిట్​లో కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details