తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో కొండచిలువ.. భయాందోళనలో ప్రజలు - యర్రగొండపాలెం

Python: సాధారణంగా పాము అంటేనే అమ్మో అని పరుగులు తీస్తాం. అలాంటిది కొండ చిలువ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దాని ఆకారం చూడగానే బెంబేలెత్తి పోతాం. అలాంటిది 11 అడుగుల కొండ చిలువ ప్రకాశం జిల్లాలో కలకలం సృష్టించింది. దానిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ప్రకాశం జిల్లాలో కొండచిలువ.. భయాందోళనలో ప్రజలు
ప్రకాశం జిల్లాలో కొండచిలువ.. భయాందోళనలో ప్రజలు

By

Published : Nov 2, 2022, 3:13 PM IST

Python: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దువ్వలి ఏస్సీ పాలెంలో 11 అడుగుల కొండచిలువ కలకలం రేపింది. దీనిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం గ్రామస్థులు యర్రగొండపాలెం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించటంతో.. స్నేక్ రెస్క్యూయర్‌ మల్లికార్జున అక్కడికి చేరుకుని, కొండచిలువను పట్టుకుని బంధించాడు. భయందోళనకు గురైన ప్రజలు కొండ చిలువను పట్టుకోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రకాశం జిల్లాలో కొండచిలువ.. భయాందోళనలో ప్రజలు

ABOUT THE AUTHOR

...view details