ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగేలా చూడాలని... ఆ ప్రాంత మహిళలు బెజవాడ దుర్గమ్మను వేడుకున్నారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం తదితర గ్రామాల నుంచి మహిళలు, రైతులు పొంగళ్లతో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు.
బెజవాడ దుర్గమ్మకు పొంగళ్లు సమర్పించిన అమరావతి మహిళలు
ఎన్నో అవాంతరాల మధ్య బెజవాడ దుర్గమ్మకు.. అమరావతి మహిళలు పొంగళ్లు సమర్పించారు. మెడలో వేసుకున్న ఆకుపచ్చ కండువాలు తీస్తేనే ఆలయంలోనికి అనుమతిస్తామని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు మహిళలను మాత్రమే ఆలయానికి అనుమతించారు.
బెజవాడ దుర్గమ్మకు పొంగళ్లు సమర్పించిన అమరావతి మహిళలు
జై అమరావతి అంటూ నినదిస్తూ వచ్చిన వారిని ప్రకాశం బ్యారేజి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మెడలో వేసుకున్న ఆకుపచ్చ కండువాలు తీసేసి వెళ్లాలని, లేదంటే అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత మహిళలను మాత్రమే ఆలయానికి పంపించారు.
ఇదీ చదవండి:సర్వం… సుందరం…నిర్మాణ శోభితంగా యాదాద్రి క్షేత్రం..!!