తెలంగాణ

telangana

ETV Bharat / state

'వర్గ విభేదాలు వదిలి పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కండి' - రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్​ షా వార్నింగ్​

Amit Shah Warning to Telangana BJP Leaders : రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్రమంత్రి అమిత్​ షా వార్నింగ్​ ఇచ్చారు. వర్గవిభేదాలు వదిలి పార్లమెంటు ఎన్నికలకు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా, రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం చార్మినార్​ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు.

Amit Shah Visit Charminar Bhagya Lakshmi
amit shah tour

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2023, 4:41 PM IST

Amit Shah Warning to Telangana BJP Leaders :రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా(Amit Shah) వార్నింగ్​ ఇచ్చారు. ఇప్పటివరకు వర్గ విభేదాల వల్లే నష్టపోయామని, ఇక నుంచి ఎలాంటి విభేదాలు లేకుండా కలిసి పని చేయాలని పార్టీ నేతలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయని అన్నారు. అనుకున్న సీట్లు సాధించలేదని, 30 సీట్లు వస్తాయని ఆశించామని తెలిపారు.

వచ్చే ఏడాది జరిగే లోక్​సభ ఎన్నికల్లో (Parliament Elections 2024)సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలన్నారు. ఈసారి కూడా సిట్టింగ్​ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మిలిగిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తామని మాటిచ్చారు. ఈసారి అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తామని కేంద్రమంత్రి అమిత్​ షా వెల్లడించారు. నగరంలోని నోవాటెల్​లో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో అమిత్​ షా పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఓటింగ్​ శాతం ఘననీయంగా పెరగడంపై అమిత్​ షా హర్షం వ్యక్తం చేశారు.

Amit Shah Visit Charminar Bhagya Lakshmi Temple :అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని(Bhagyalaxmi Temple) కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సందర్శించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఉన్న పూజారులు అమిత్​ షాకు తీర్ధప్రసాదాలు అందించారు. కేంద్ర మంత్రి అమిత్​ షా వెంట రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​ రెడ్డి(Kishan Reddy), బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్​, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ ఉన్నారు.

భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కేంద్రమంత్రి అమిత్​ షా రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్​లోని శ్లోక కన్వెక్షన్​లో జరిగే బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో భేటీ అయి, వారిని సత్కరించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు తిరిగి విమానంలో దిల్లీ చేరుకోనున్నారు.

Amit Shah Visit Hyderabad :మధ్యాహ్నంశంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్​ షాకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా నోవాటల్​కు వెళ్లిన కేంద్ర హోంమంత్రి పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

బీజేపీ విస్తృతస్థాయి సమావేశం :

మూడు క్రిమినల్​ బిల్లులకు లోక్​సభ ఆమోదం- బ్రిటిష్ కాలంనాటి సెక్షన్లకు చెక్!

వ్యూహం అంటే ఇది కదా- సీఎంల ఎంపికలో మోదీ, షా మార్క్- '2024లో అధికారం బీజేపీదే!'

ABOUT THE AUTHOR

...view details