Amit Shah Speech at Telangana BJP Leaders Meeting : ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడి పనిచేస్తే 400 పైగా సీట్లు గెలుస్తామని కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించిందని, ఈ ఎన్నికల్లో 8 సీట్లు సాధించామని హర్షించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం, తెలంగాణలో 64 లేక 95 సీట్లు రావచ్చని జోస్యం చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంగర కలార్‌లో ఉన్న శ్లోక కన్వెక్షన్‌లో జరిగిన బీజేపీ(BJP) రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరయ్యారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి మండల అధ్యక్షుడి నుంచి జాతీయ స్థాయి నేతల వరకు ఆహ్వానించారు.
గత ప్రభుత్వంలో కేసీఆర్(KCR) సర్కార్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపణలు చేశారు. మాదిగ సమాజానికి న్యాయం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే అని స్పష్టం చేశారు. 25 శాతానికి పైగా ఓట్లు 10కి పైగా ఎంపీ సీట్లే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీ నాది అనేలా పనిచేయాలన్నారు. ముందుగా సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని డీకే అరుణ ప్రవేశపెట్టారు. వచ్చే ఎన్నికల్లో మోదీ(PM Modi) విజయం చారిత్రక అవసరమనే తీర్మానం ప్రవేశపెట్టగా సమావేశంలో అందరూ ఆమోదించారు.
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్‌తో గెలుస్తాం : కిషన్‌రెడ్డి
చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం : అంతకు ముందు చార్మినార్ భాగ్యలక్ష్మీ(Charimar Bhagya Lakshmi) అమ్మవారిని కేంద్రమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి పూజారులు ఇచ్చిన ఆశీర్వచనాలు తీసుకున్నారు. అమిత్ షా వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు.