తెలంగాణ

telangana

ETV Bharat / state

సమయాభావం వల్ల మధ్యలోనే ముగిసిన అమిత్‌ షా భారీ రోడ్‌ షో.. - Hyderabad latest news

భారీ ఎత్తున భాజపా శ్రేణుల మధ్య హైదరాబాద్​లో అమిత్ షా రోడ్​ షో ముగిసింది. సమయాభావం వల్ల సీతాఫల్‌మండి చేరకుండానే రోడ్‌షోను అమిత్‌ షా ముగించారు. జనసేన కార్యకర్తలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్​ షోతో రహదారులన్ని కాషాయమయంగా మారాయి.

amith
భాజపా శ్రేణుల మధ్య వారాసిగూడలో అమిత్‌ షా రోడ్‌ షో

By

Published : Nov 29, 2020, 1:41 PM IST

Updated : Nov 29, 2020, 2:28 PM IST

హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రోడ్‌షో ముగిసింది. చార్మినార్​ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్​ షా... వారాసిగూడకు బయలుదేరారు. భూపేందర్ యాదవ్, లక్ష్మణ్, బండి సంజయ్​లతో కలిసి రోడ్​షో లో పాల్గొన్నారు. వారాసిగూడ నుంచి కొంత దూరం రోడ్‌షో నిర్వాహించారు. శ్రేణులు భారీగా తరలిరావడంతో రహదారులన్ని కాషాయమయమయ్యాయి. జనసేన కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. వాహనంపై నుంచి అమిత్ షా చేతులు ఊపుతూ.. అభివాదం చేస్తూ.. స్థానికులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రహదారులన్నీ జనసంద్రం కావడంతో.. రోడ్ షో వేగంగా కదలలేదు. ఫలితంగా సమయాభావంతో సీతాఫల్‌మండి చేరకుండానే అమిత్‌ షా రోడ్‌షో ముగించారు.

రోడ్డు షో ముగిసిన అంతరం భాజపా రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. ముందుగా మీడియా సమావేశం అనంతరం.. సాయంత్రం వరకు భాజపా నేతలతో సమావేశమవుతారు. అనంతరం బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి... అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు.

బల్దియా ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో... అమిత్ షాను భాజపా రంగంలోకి దింపింది. ఆఖరి రోజు అమిత్ షా ప్రచారం మంచి ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Last Updated : Nov 29, 2020, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details